Minister Ramprasad Reddy: వ్యాపారులను వేధించే నైజం మాది కాదనీ, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్ లో పౌరసరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంట నూనెల ప్రత్యేక విక్రయ కేంద్రాలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు వంట నూనెల ను సరసమైన ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బహిరంగ మార్కెట్ లో పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ నూనెలు అధిక ధరలు ఉన్న నేపథ్యంలో నూనె మిల్లుల యజమానులు, వ్యాపారులతో మాట్లాడి వినియోగదారులకు సరసమైన ధరలకు వంట నూనెలు అందించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక కౌంటర్లు ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధికారులు వ్యాపారులను బెదిరించినా, లంచం అడిగినా నేరుగా సహించేది లేదనీ, అందుకు సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వం లాగా వ్యాపారులను వేధించే నైజం మా ప్రభుత్వానికి లేదన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్