Site icon NTV Telugu

Fake Currency: ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు.. 735 నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం

Fake Notes

Fake Notes

Fake Currency: అన్నమయ్య జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరార్ అయ్యారు. ఇక, నిందితుల నుంచి సుమారు 3, 67,500 లక్షలు విలువ చేసే 735 నకిలీ 500 రూపాయల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కరెన్సీ నోట్లతో పాటు ల్యాప్ ట్యాప్, కలర్ ప్రింటర్, స్కానర్, లామినేషన్ మిషన్, ఆర్బీఐ అక్షరాలతో ముద్రించే ఆకు పచ్చ రిబ్బన్, ఏ4 పేపర్ బండిల్స్, 12 మొబైల్ ఫోన్లు రికవరీ చేసుకున్నారు.

Read Also: Viral Video: బుసలు కొడుతున్న 18 అడుగుల కింగ్ కోబ్రా.. ఈజీగా పట్టేసిన లేడీ ఆఫీసర్‌!

అయితే, పట్టుబడ్డ నిందితులలో 8 మంది అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నకిలీ కరెన్సీ నోట్లను నిందితులు విక్రయించినట్లు తేలింది. వాయల్పాడు లక్కీ వైన్స్ మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదుతో ఈ నకిలీ కరెన్సీ నోట్లు బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీ ముఠాను అరెస్టు చేసిన వాయల్పాడు పోలీసులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు.

Exit mobile version