Site icon NTV Telugu

Sugavasi Palakondrayudu: టీడీపీలో విషాదం.. సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కన్నుమూత

Sugavasi Palakondrayudu

Sugavasi Palakondrayudu

Sugavasi Palakondrayudu: అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కన్నుమూశారు.. 80 ఏళ్ల పాలకొండరాయుడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు.. రెండు రోజుల క్రితం అనారోగ్యపాలైన సుగవాసి పాలకొండరాయుడును బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.. ఒకసారి రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుగవాసి పాలకొండరాయుడు.. రాజకీయాలలో తనకంటూ ఓ స్థానం దక్కించుకున్నారు..

Read Also: Supreme Court: సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు

ఇక, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంపీ, ఎమ్మెల్యే గా పనిచేశారు.. అయితే, పాలకొండరాయుడు మృతి విషయం తెలుసుకుని షాక్ కు గురయ్యారు టీడీపీ శ్రేణుల, ఆయన అభిమానులు.. దీంతో, రాయచోటి నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. మరోవైపు, సుగవాసి పాలకొండరాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి.. పాలకొండ రాయుడు మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు… పాలకొండ రాయుడు మృతి ఆయన కుటుంబానికి, రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, టిడిపి కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు.. రాయచోటి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, రాజంపేట ఎంపీగా ఒకసారి గెలిచిన పాలకొండ రాయుడుకు రాయచోటి ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, దేవుని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి..

Exit mobile version