అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కన్నుమూశారు.. 80 ఏళ్ల పాలకొండరాయుడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు.. రెండు రోజుల క్రితం అనారోగ్యపాలైన సుగవాసి పాలకొండరాయుడును బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు..