NTV Telugu Site icon

Deputy CM Pawan: నేడు కడపకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

Pawan

Pawan

Deputy Cm Pawan: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. అందులో భాగంగా.. ఈరోజు కడపలో పర్యటించబోతున్నారు.. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును ఆయన పరామర్శించనున్నారు. ఈ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఇక, నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. గాలివీడులో ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం గాలివీడు నుంచి రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. భోజన విరామం తర్వాత రోడ్డు మార్గాన కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి గన్నవరం వెళ్ళనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Show comments