Site icon NTV Telugu

AP Crime: లవర్స్‌ డే రోజు దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్‌ దాడి.. ఆ తర్వాత..

Acid

Acid

AP Crime: ప్రేమికుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది‌. తన ప్రేమను అంగీకరించలేదంటూ ఓ యువతిపై యాసిడ్ దాడి చేశాడు ప్రియుడు‌. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.. జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23) పై మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు. గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గౌతమికి ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి నిశ్చయం అయింది. ఏప్రిల్ 29న పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్.. ప్యారంపల్లికి చేరుకుని గౌతమిని ప్రేమించమంటూ వెంటపడ్డాడు.. ఈ రోజు సదరు యువతి తల్లితండ్రులు పాలు పిండటానికి వెళ్లడం గమనించి అక్కడికి వెళ్లి గౌతమి తలపై కత్తితో దాడి చేశాడు.. ఆ తర్వాత మొహంపై యాసిడ్ పోశాడు.. తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also: Kadapa Crime: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్య దారుణ హత్య

Exit mobile version