Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్‌తో ఇలా చెక్ చేయండి
- అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు ఎంత సాయం?
- ఆధార్‌తో ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసే విధానం
- వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం
- డబ్బులు రాకపోతే రైతులు ఏం చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annadata Sukhibhava status : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు , పేమెంట్ స్టేటస్ (Payment Status) ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా లభించే పెట్టుబడి సహాయం తమ బ్యాంక్ ఖాతాల్లో జమ అయిందో లేదో రైతులు ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 పెట్టుబడి సహాయాన్ని మూడు విడతల్లో అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే ‘పీఎం కిసాన్’ (PM-Kisan) వాటా రూ. 2,000 , రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 5,000 కలిపి, విడతకు మొత్తం రూ. 7,000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో జమ చేస్తున్నారు.
Also Read
- Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
- KGBV జాబ్స్.. 299 పోస్టులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే దరఖాస్తులు.!
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Salary Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త.. 10 శాతంపైగా జీతాలు పెంచిన ప్రభుత్వం
అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకునే విధానం:
- స్టెప్ 1: మొదట అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- అధికారిక వెబ్సైట్: https://annadathasukhibhava.ap.gov.in/
- స్టెప్ 2: హోమ్‌పేజీ ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే ‘Know Your Status’ లేదా ‘Beneficiary Status’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: ఇప్పుడు అక్కడ ఓపెన్ అయిన బాక్స్‌లో రైతు యొక్క ఆధార్ నెంబర్ (Aadhaar Number) లేదా అప్లికేషన్ ఐడీని నమోదు చేయాలి.
- స్టెప్ 4: వివరాలు నమోదు చేశాక, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
- స్టెప్ 5: ఓటీపీ సబ్మిట్ చేసిన వెంటనే మీ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయా లేదా, ఒకవేళ పెండింగ్‌లో ఉంటే దానికి గల కారణం ఏమిటి అనే పూర్తి స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
వాట్సాప్ (WhatsApp) ద్వారా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.!
- రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ సేవ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించింది.
- ఇందుకోసం మొదట 9552300009 నెంబర్‌ను మీ మొబైల్లో సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపాలి.
- అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘సేవలను ఎంచుకోండి’ పై క్లిక్ చేసి, డ్రాప్ డౌన్ మెనూ నుండి ‘అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava) ను సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ‘Status Check’ ఆప్షన్‌ను ఎంచుకుని, రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా అప్లికేషన్ స్థితిని మొబైల్లోనే సులభంగా చూడవచ్చు.
డబ్బులు పడకపోతే ఏం చేయాలి?
అర్హత ఉండి కూడా ఖాతాలో డబ్బులు జమ కాకపోవడానికి ప్రధాన కారణాలు: ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ కాకపోవడం, బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ మ్యాపింగ్ (e-KYC) పూర్తి అవ్వకపోవడం లేదా భూమి రికార్డులలో తప్పులు ఉండటం. ఇటువంటి సమస్యలు ఉన్న రైతులు వెంటనే తమ పరిధిలోని ‘రైతు సేవా కేంద్రం’ (Rythu Seva Kendra) లేదా స్థానిక గ్రామ సచివాలయ వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్‌తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
-
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్‌ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!