Site icon NTV Telugu

నేరగాళ్లకు ఏపీ ఫ్రెండ్లీ స్టేట్‌గా మారింది: పీతల సుజాత

మహిళలపై అత్యాచారాలలో ఏపీ రెండవ స్థానంలో ఉందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వ్యక్తి సీఎం జగన్‌ అని, ఇక రాష్ట్ర మహిళలకు ఏం ఇస్తాడు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు ప్రెంఢ్లీ స్టేట్‌ గా ఆంధ్రప్రదేశ్‌ మారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అత్యాచారం చెయ్యాలంటే‌‌ భయపడే పరిస్థితి చంద్రబాబు కల్పించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1500 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు.

Read Also: ఉద్యోగులపై ఎస్మా బాణం… ఏపీ సర్కార్ ఐడియా?

జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేదు: వంగలపూడి అనిత
జగన్ పాలనలో మహిళలకు మాన ప్రాణలకు రక్షణ లేకుండా పోయిందని వంగలపూడి అనిత ఆరోపించారు. మైనర్‌ బాలికలను కూడా వైసీపీ నాయకులు వదలడం లేదన్నారు. 14 ఏళ్ల బాలిక పై అత్యాచారం జరిగి రెండు నెలలు గడిచిన ఇంత వరకు న్యాయం జరగలేదని విమర్శించారు. చిన్నారిపై వైసీపీ నాయకుడు కన్నా భూశంకర్ అత్యచారం‌ చేశాడన్నారు. మైనర్‌ బాలికల అపహరణలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. హోంశాఖ మంత్రి సుచరిత నిస్సహాయ శాఖగా మంత్రిగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా వైసీపీ నాయకుల హస్తం ఉంటుందన్నారు. అత్యచార బాధితురాలిని పరామర్శించడానికి వస్తే..ఆమెను లేకుండా చేశారు. అమ్మయిని పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులుకు విజ్ఞప్తి చేస్తున్నాం.వైపీపీ నేతలు బలహీన వర్గ మహిళలను టార్గెట్ చేశారన్నారు. మహిళా‌ కమిషన్‌ చైర్మన్‌ ఉన్నారా లేదా అనే అనుమానం వస్తుందన్నారు. రాష్ట్రంలో‌ పరిశ్రమలు రాలేదుకాని‌ గంజాయి, డ్రగ్స్ వచ్చాయన్నారు. జగన్‌పై మహిళలు చెప్పులు విసిరరే రోజు త్వరలో వస్తుందని ఎద్దేవా చేశారు.

Exit mobile version