జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్.. మరోసారి జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయలేని పవన్ కల్యాణ్… భీమ్లా నాయక్ కాదని తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read Also: VH: మళ్లీ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన వీహెచ్.. చెప్పినా పట్టించుకోరా..?
పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనిల్ కుమార్ యాదవ్… అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ పెట్టే ధైర్యం కూడా లేని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చమెత్తుకుని 35 సీట్లు, 40 సీట్లలో 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాడని ఎద్దేవా చేశారు.. ఇలాంటి వ్యక్తి సీఎం అభ్యర్థి ఎలా అవుతాడని విమర్శలు సంధించిన మాజీ మంత్రి అనిల్… పవన్ కల్యాణ్కు బిచ్చం నాయాక్ పేరు కరెక్టుగా సరిపోతుందని విమర్శించారు… పవన్ కల్యాణ్ అభిమానులు తనపై ఎన్ని ట్రోల్స్ చేసుకున్న తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదన్నారు అనిల్ కుమార్ యాదవ్.. మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఆయన ఎంత గౌరవం ఇచ్చారో తాను అంతకు రెట్టింపు ఇస్తానని స్పష్టం చేశారు.
