V Srinivasa Rao: ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పటి వరకు కేంద్రం సహాయం అందించలేదని.. కేంద్రం తీరు అన్యాయంగా ఉందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు అన్నారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కనీసం వైసీపీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. మరోవైపు నేరస్థులే జడ్జి స్థానంలో ఉన్నట్లుగా బీజేపీ వైఖరి ఉందన్నారు. బీజేపీ నేతలు రాజధానికి నిధులు ఇవ్వకుండా తాము అధికారంలోకి వస్తే రాజధాని కడతామంటున్నారని.. రాజధాని అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సోము వీర్రాజుని రైతులు నిలదీస్తే పారిపోయారన్నారు.
Tammineni Veerabhadram: సీపీఎం టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోదు..
కేంద్రంలోని బీజేపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. జగన్ డబ్బు ఎక్కడ ఉందో సత్యకుమార్ ప్రజలకు చూపించాలన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా ప్రజలపై భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంపై ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. వైద్య రంగంలో ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. దేశంలో పరిస్థితులపై ప్రతిపక్ష పార్టీలతో కలిసి వైసీపీ పోరాటం చేయాలని సూచించారు. వైసీపీ ప్రజా అనుకూల విధానాలను అవలంభించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలం గ్రామాలు తెలంగాణలో కలపాలనడంలో రాజకీయ పార్టీల నిర్ణయం ఉండదని.. ప్రజాభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏపీలో బీజేపీకి వత్తాసు పలుకుతున్న రెండు పార్టీలకు తగిన శాస్తి జరుగుతుందని ఆయన అన్నారు.
