NTV Telugu Site icon

AP Wines Shops Close: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. వైన్ షాపులు బంద్..?

Wine Shops

Wine Shops

AP Wines Shops Close: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మందబాబులకు బ్యాడ్‌న్యూస్.. రేపు మద్యం షాపులు బంద్‌ చేయాలని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌‌తోనే ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్వ్యూల ద్వారా తమను ఎంపిక చేశారు.. ఇప్పుడు తాము ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.. ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించే వరకు ఈ బంద్‌ కొనసాగిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. ప్రభుత్వం వీరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Read Also: Vikram Rathod: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా టీమిండియా మాజీ కోచ్..

మరోవైపు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే.. 15 వేల మంది కాంట్రాక్ట్‌, ఔవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రోడ్డున పడతారని వాపోతున్నారు. తమ విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, మద్యం షాపుల్లో కాకపోయినా.. తమకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ సంఘం కోరింది. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. కేవలం ఉపాధి కల్పించాలనేది తమ డిమాండ్ అని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. అందుకే రేపటి నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Show comments