ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతము నైరుతి రుతుపవనాల ఉపసంహరణ లైన్ 27.1° N అక్షాంశము/84.7° E రేఖాంశము, మోతిహరి, గయా, డాల్టోంగాంజ్, అంబికాపూర్, మండలా, ఇండోర్, గాంధీనగర్, రాజ్‌కోట్ మరియు పోర్బందర్ల గుండా వెళుతుంది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుండి; మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌లోని చాలా ప్రాంతాలు నుండి; మహారాష్ట్ర, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు నుండి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయి.
ఉత్తర అండమాన్ సముద్రము మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము సగటు సముద్రమట్టానికి 5.8 సెం.మీ ఎత్తువరకు కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన అదే ప్రాంతంలో రాగల 48 గంటలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 4-5 రోజులలో మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా & ఉత్తరకోస్తా ఆంధ్ర ప్రదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
Also Read
- Stop Diarrhoea Campaign: రేపటి నుంచి ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం.. 37.53 లక్షల చిన్నారులకు ఉచిత ఓఆర్ఎస్, జింక్ మాత్రలు
- CM Chandrababu: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రముఖ సంస్థలతో కీలక సమావేశాలు
- Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
- Chintamaneni Prabhakar: ఏలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. ఎమ్మెల్యే చింతమనేని హల్చల్, శ్రీనివాస్ సస్పెండ్!
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది .
రాయలసీమ:
ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. నాలుగు సార్లు చెంపదెబ్బలు
-
Kundu couple: దీదీ తృణమూల్‌ను తుత్తునకలు చేసిన కుందు దంపతులు? ఒక సాదాసీదా పార్టీని లోక్‌సభలోనే కింగ్ మేకర్‌గా ఎలా మార్చారు!
-
PM Modi: స్లోవేకియాలో మోడీ పర్యటన.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Stop Diarrhoea Campaign: రేపటి నుంచి ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం.. 37.53 లక్షల చిన్నారులకు ఉచిత ఓఆర్ఎస్, జింక్ మాత్రలు
-
ICC Rankings: అగ్రస్థానంలో టీమిండియా.. ఆసీస్ పైకి.. సౌతాఫ్రికా కిందకు..
ట్రెండింగ్
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!