Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఎవ్వరిని నమ్మడానికి వీలులేదు.. కొందరు కేటుగాళ్ళు మహిళను నమ్మించి అతి దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. తెలిసిన యువకుడు కదా అని నమ్మాడు.. నిండా ముంచేసాడు..ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో ఉన్న ఆమె భర్తకు పంపించాడు.. ఇక భార్య భర్తల మధ్య ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఏమి చేయాలో పాలుపోని ఆ వివాహిత దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. దిశ టీం వెంటనే రంగంలోకి దిగి ఆమెకు భరోసా ఇచ్చింది. నిందితుడిపై కేసు ఫైల్ చేసింది.. అసలు నిజాలను బయటపెట్టింది..
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది… కోన సీమ జిల్లా గోపాలపురానికి చెందిన అచ్చిరెడ్డి, మీనా అనే మహిళను నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో వెంటబడి వేధించాడు. అప్పుడే అచ్చిరెడ్డిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆమెను ఇబ్బంది పెట్టనని పెద్దమనుషుల ముందు అచ్చిరెడ్డి చెప్పడంతో ఆ గొడవ అక్కడితో సర్దు మణిగింది.. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాడు.. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది..
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
మీనాను రావులపాలేనికి చెందిన పెద్దిరెడ్డితో మీనా పెళ్లి జరిపించారు. వారి దాంపత్యం హ్యాపీగా సాగింది. ఆయన ఉపాధి రీత్యా కొన్ని రోజుల క్రితమే దుబాయ్ వెళ్లాడు. ఆయన దుబాయ్ వెళ్లిన తర్వాత అచ్చిరెడ్డి వేధింపుల పర్వం మళ్లీ మొదలైంది. అచ్చిరెడ్డి గతంలో మీనాతో దిగిన ఫొటోలను ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో తన భర్తకు పంపాడు.. అలా తరచూ చేస్తూ వస్తున్నాడు…ఇక మీనా దిశ పోలీసులను ఆశ్రాయించింది.. అసలు విషయాన్ని పోలీసులకు తెలిపారు.. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.. మార్ఫింగ్ ఫొటోలను, బ్లాక్ మెయిలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వారు సేకరించారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఆమెకు భరోసా కల్పించారు..
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!