NTV Telugu Site icon

Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Tenth Class Exams

Tenth Class Exams

Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. సీబీఎస్‌ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. అటు తెలంగాణలోనూ ఏప్రిల్ 3 నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Read Also: Rishab Pant Injury: నిద్రమత్తులో కారు నడిపిన పంత్.. అందుకే ప్రమాదం

కాగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం తెస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్‌లు, పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్‌లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.