ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఓవైపు మంత్రులు, వైసీపీ నేతలు.. మరోవైపు విపక్షాలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి జోగి రమేష్.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కొవడానికి చంద్రబాబుకి దమ్ములేదన్నారు.. ఇక, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 86 నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం పార్టీకి దిక్కేలేదని.. ఆ పార్టీ నిర్వహించిన సర్వేలే ఈ విషయాన్ని బయటపెట్టాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.. 175 సీట్లలో టీడీపీ అభ్యర్ధులను నిలబెట్టి.. నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ బహిరంగ సవాల్ విసిరారు జోగి రమేష్.
Read Also: Intelligence vs Police: జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ డీజీ నుంచి ఆదేశాలు.. డీజీపీ తీవ్ర అభ్యంతరం..!
మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా వదలకుండా ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. సైకో సేన పవన్ కల్యాణ్ నువ్వు కూడా 175 సీట్లలో నీ అభ్యర్ధులను నిలబెట్టు.. దమ్ముoదా? అని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ పవన్ కల్యాణ్ నిలబడినా ఓడిపోతాడని జోస్యం చెప్పారు.. ఇదే సమయంలో.. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యం, మా టార్గెట్ 175 స్థానాలని స్పష్టం చేశారు.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తామని చెబుతున్నారు.. ఇది రాజమౌళి, విఠలాచర్య సెట్టింగులు కాదు.. వైసీపీ కoచుకోటను ఇంచు కూడా కదిలించలేరని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్.