తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు శిక్ష విధించింది.. దాంతో పాటు రూ. 2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా.. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం కోర్టును ఆశ్రయించగా, ముగ్గురిని క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలు అమలు చేయలేదు.. దీంతో ఉద్యోగులు కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు.. దీనిపై విచారించిన కోర్టు.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ మధ్యహ్నం 12 గంటల సమయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదంటూ టీటీడీ ఈవోకి నెలరోజుల శిక్ష విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. రెండు వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు 27వ తేదీలోపు అమలు చేయపోతే శిక్షా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది.. మరో వైపు సింగిల్ బెంచ్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యహ్నం 2 గంటల సమయంలో స్టే విధించింది డివిజన్ బెంచ్.. అయితే, టీటీడీ ఈవోపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనుంది టీటీడీ.
Read Also: Ajay Kallam: గడువులోగా సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి..