NTV Telugu Site icon

Vidadala Rajini: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో విడదల రజిని భేటీ.. విలేజ్‌ క్లినిక్‌ కాన్సెఫ్ట్‌పై కేంద్రం ప్రశంసలు

Vidadala Rajini

Vidadala Rajini

ఢిల్లీ పర్యటన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశం అయ్యారు.. ఏపీలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరినట్టు ఆమె వెల్లడించారు.. ఇక, కేంద్రమంత్రి అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సచివాలయం, విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్ ను కేంద్ర మంత్రి ప్రశంసించారని మీడియాకు తెలియజేశారు మంత్రి విడదల రజిని… ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్‌ లో చర్చిస్తామన్నారని.. అలాగే ప్రధాని నరరేంద్ర మోడీకి సైతం దీనిని చూపేందుకు ఏపీకి తీసుకొస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ క్లినిక్ లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్‌ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..

Read Also: Addanki Dayakar: వీడిన కోమటిరెడ్డి మిస్టరీ.. త్వరలో అభ్యర్థి ప్రకటన

గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు.. వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయనున్నారు.. ఇప్పటికే భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కానున్నాయి. ఒక్కో విలేజ్‌ క్లినిక్‌లో అవుట్‌ పేషెంట్‌ రూమ్, ఎగ్జామినేషన్‌ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.. ప్రతీ 2,500 జనాభాకు ఒక విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇక, దీని కోసం డిసెంబర్‌లోగా బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన 7,112 మంది మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమించనుంది ప్రభుత్వం.. ఇప్పటికే 2,920 క్లినిక్‌లలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు. ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్‌ మెడికిల్‌ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచబోతున్నారు..