NTV Telugu Site icon

AP Govt: ఏపీలో ఆరు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు.. రూ. 1.92 కోట్ల నిధులు రిలీజ్

Ap Govt

Ap Govt

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఆరు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం 1.92 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో మరో ఆరు చోట్ల ఎయిర్ పోర్టులు కట్టాలని ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో విమానాశ్రయాలను నిర్మించాలని ఎన్టీయే కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే, కుప్పంలో 1501, నాగార్జున సాగర్ లో 1670 ఎకరాలను, తాడేపల్లి గూడెంలో 1123 ఎకరాలు, శ్రీకాకుళంలోని పలాస డివిజన్ లో 1383 ఎకరాలు, తుని- అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలను గుర్తించినట్టు స్పష్టం చేశారు.

Read Also: Manipur Violence: ఆరుగురి హత్యతో మణిపూర్‌లో హింస.. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్..

అయితే, నిధులు కేటాయించిన నేపథ్యంలో, సాధ్యమైనంత త్వరగా ఫీజిబిలిటీ స్టడీ పూర్తి చేయాలని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు ఉత్తర్వులు జారీ చేశారు.