NTV Telugu Site icon

ఎస్మాపై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు.. ఈ రంగాల‌వారే టార్గెట్..!

ఓవైపు చ‌ర్చ‌ల‌కు ఎప్పుడైనా సిద్ధం అంటూనే.. ఉద్యోగులు స‌మ్మెకు వెళ్లే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డంతో.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు అయినా వెనుకాడేది లేద‌నే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది.. రాష్ట్రంలో ఎస్మా ప్రయోగించటానికి ఉన్న అవకాశాలపై ఏపీ స‌ర్కార్ క‌స‌ర‌త్తు చేస్తోంది.. ఉద్యోగులు స‌మ్మెకు వెళ్తే ఏం చేద్దాం.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందాం..? ప‌్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? త‌దిత‌ర అంశాల‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.. మంత్రులు బుగ్గన, బొత్స, సలహాదారు సజ్జలతో ఈ స‌మావేశం రెండు గంట‌ల‌కు పైగా కొన‌సాగుతుండ‌గా.. క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి బ‌య‌ల్దేరి వెళ్లిపోయారు సీఎస్ సమీర్ శర్మ.

Read Also: సజ్జల సీరియ‌స్‌.. ఉద్యోగుల‌కే న‌ష్టం.. !

మ‌రోవైపు.. స‌మ్మె నేప‌థ్యంలో.. జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశం కానున్నారు సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. ఇవాళ సాయంత్రం జ‌రిగిన స‌మావేశంలో.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయ‌నున్నారు.. అత్యవసర సేవల నిర్వహణా చట్టం 1971 ప్రకారం ఎస్మా ప్రయోగించే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ స్టాఫ్, ప్రజా రవాణా, విద్యుత్, నీళ్ల సప్లయ్, అంబులెన్స్ సర్వీసులు, మందుల తయారీ, రవాణా, ఆహార రంగం, బయో మెడికల్ వ్యార్ధాల నిర్వహణ వంటి సేవల అంశాల్లో ఎస్మా ప్రయోగించే అవ‌కాశం క‌నిపిస్తోంది.. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.. మరోవైపు సీపీఎస్ రద్దు, హెచ్ఆర్ఎ జీవోల్లో సవరణ అంశం పై సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేశారు.