NTV Telugu Site icon

File Level Pumping System: సచివాలయంలో కొత్త విధానం.. ఫైల్ లెవల్‌ జంపింగ్‌పై జీవో జారీ

Ap Secretariat

Ap Secretariat

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కొత్తగా ఫైల్ జంపింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం… ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం లేకుండా ఉండేందుకు ఫైల్ జంపింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ సర్కార్… ఈ మేరకు ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్ బిజినెస్ నిబంధనల్ని సవరణకు ఆమోదం తెలిపారు.. జీఏడీ ఇచ్చిన నోట్ ఆధారంగా సచివాలయ మాన్యువల్లో మార్పు చేర్పులు చేశారు.. సచివాలయంలో అనసవరమైన స్థాయిల్లో ఫైళ్లను తనిఖీ చేయటం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. సహాయ సెక్షన్ అధికారి నుంచి మంత్రి వరకూ నాలుగు స్థాయిల్లో ఫైళ్లు సర్కులేట్ అయితే సరిపోతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం..

Read Also: Vidadala Rajini: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో విడదల రజిని భేటీ.. విలేజ్‌ క్లినిక్‌ కాన్సెఫ్ట్‌పై కేంద్రం ప్రశంసలు

ఏపీ సచివాలయ మాన్యువల్ సవరణలకు అనుగుణంగా పని విభజన చేపట్టాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఆయా శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శుల స్థాయిలో లెవల్ జంపింగ్ చేయించే అంశంలో సూచిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, గతంలో లెవల్ జంపింగ్ విధానం వద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాసింది ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం..సెక్రటేరియట్ సర్వీస్‌రూల్స్‌కు విరుద్ధంగా లెవల్‌ జంపింగ్ విధానం వద్దని కోరారు.. ఇప్పుడు, ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్‌ మాన్యువల్‌ను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.