Site icon NTV Telugu

Andhra Pradesh: సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్

Grama Sachivalayam

Grama Sachivalayam

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర అధ్యక్షులు జానీ పాషా తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం నాడు కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. జూన్ 30లోగా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. విజయవాడలో సీఎం జగన్‌కు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని జానీ పాషా పేర్కొన్నారు.

కాగా ప్రొబేషన్ ఖరారు చేసేందుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలు పంపాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సోమవారం లేఖలు రాసింది. ఉద్యోగుల ప్రొబేషన్ 2022 జూన్ నాటికి ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున సంబంధిత ప్రభుత్వ శాఖల విభాగాల అధిపతుల సమాచారం ఆధారంగా అర్హుల జాబితాలు ఈనెల 16లోగా పంపాలని సచివాలయాల శాఖ సంచాలకులు షన్మోహన్ కలెక్టర్లకు సూచించారు. ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో 12,901 ఏఎన్‌ఎంలు, 11,636 ఇతర ఉద్యోగులు ఉత్తీర్ణులైన విషయాన్ని కలెక్టర్లకు రాసిన లేఖలో షన్మోహన్ ప్రస్తావించారు. తాము పంపిన నమూనా ఆధారంగా కలెక్టర్లు సమాచారం పంపాలని ఆయన కోరారు.

Asani Cyclone: దిశ మార్చుకున్న ‘అసని’.. ఏపీకి తప్పనున్న ముప్పు

Exit mobile version