ఏపీ ప్రభుత్వంలో నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం సలహాదారుడు ఎం.శామ్యూల్ (రిటైర్డ్ ఐఏఎస్), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్) పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీళ్లంతా మరో ఏడాది పాటు సలహాదారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కాగా 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురిని ప్రభుత్వం సలహాదారులుగా నియమించింది. శాఖలవారీగా సలహాదారుల నియామకం జరిగింది. వీరిలో పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. పరిస్థితి ఆధారంగా సలహాదారుల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తోంది. ఈ క్రమంలోనే మరో ఏడాది పాటు నలుగురు సలహాదారులను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. నలుగురు సలహాదారుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు.
Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్
