Site icon NTV Telugu

Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

Illegal Affairs

Illegal Affairs

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 2020-21 మధ్య 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై నిర్వహించిన సర్వేలో దక్షిణాదిలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్న మగవారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మగాళ్లు ముందున్నారు. ఏపీలో మాత్రం ఒక్కో అబ్బాయి తనకు ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నట్లు వెల్లడైంది. అటు తెలంగాణలో ఒక్కో పురుషుడు ముగ్గురితో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు సర్వే ద్వారా తెలిసింది.

Read Also:

Work from home: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లేదా..? అయితే ఇదిగో రాజీనామా..!

నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే-5 రెండో విడతలో భాగంగా నిర్వహించిన ఏపీలోని మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉన్నామని ఒప్పుకున్నారు. జీవితకాలంలో ఎంతమంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నారనే ప్రశ్నకు మహిళల సగటు 1.4గా ఉంటే పురుషుల సగటు 4.7గా ఉంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీలోనే పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉన్నారు. అటు కర్ణాటకలో పురుషులు 2.7 మందితో, అండమాన్ నికోబార్‌ ఐలాండ్స్‌లో 2.8 మందితో, కేరళ, లక్షద్వీప్‌ పురుషుల్లో జీవితకాలంలో ఒక్కరితోనే లైంగిక సంబంధం ఉన్నట్లు చెప్పుకున్నారు. మరోవైపు పుదుచ్చేరిలో 1.2గా, తమిళనాడులో 1.8గా నమోదైంది.

Exit mobile version