ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా పెరిగిన కేసులు

AP COVID 19

AP COVID 19

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మరోసారి భారీగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 71,532 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,601 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది మృతి చెందారు. చిత్తూరులో ఆరుగురు, తూర్పో గోదావరి, కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. ఇదే సమయంలో 1,201 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,06,191కు పెరగగా… కోలుకున్నవారి సంఖ్య 19,78,364కు చేరింది.. ఇక, కోవిడ్‌ బారినపడి ఇప్పటి వరకు ఏపీలో 13,766కు చేరగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,061 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.