NTV Telugu Site icon

CM YS Jagan Vizag Tour: రేపు విశాఖకు సీఎం జగన్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Cm Ys Jagan Vizag Tour

Cm Ys Jagan

CM YS Jagan Vizag Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొననున్నారు.. ఆ తర్వాత పలు శుభకార్యాల్లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిస్తే.. రేపు ఉదయం అంటే 28వ తేదీన ఉదయం 9.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు సీఎం.. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకోనున్న ఆయన.. శారదా పీఠం వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక, మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్‌ హాల్‌లో జరగనున్న అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్‌ యశ్వంత్, డాక్టర్‌ లీలా స్రవంతి వివాహానికి హాజరై.. దంపతులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌ వద్ద గల విశాఖ ఎంపీ సత్యనారాయణ నివాసానికి వెళ్లనున్న ఆయన.. ఎంపీ కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.55 గంటలకు ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదిస్తారు… దీంతో.. సీఎం విశాఖ పర్యటన ముగియనుంది.. ఆ తర్వాత విశాఖ నుంచి బయల్దేరి సాయంత్రం 4 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Read Also: Nandamuri Taraka Ratna: నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. స్టెంట్‌ వేసిన వైద్యులు