కోనసీమ జిల్లాలో గోదావరి వరద బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శ కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్తున్న జగన్.. బాధితులను పరామర్శించారు. నేను ఉన్నానని… ఆదుకుంటానని హామీ ఇచ్చారు. పి. గన్నవరం మండలం పుచ్చకాయలవారిపేటలో మొదలైన జగన్ పరామర్శ యాత్ర గండిపెదపూడిలంక, బూరుగులంక, అరిగెలలంకల గుండా సాగింది. రోడ్లన్నీ బురదగా ఉండటంతో ట్రాక్టర్ లో సీఎం పర్యటన సాగింది. గోదావరి వరదలకు పి. గన్నవరం మండలం తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యింది. పంటలతోపాటు… ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. వరద నీరు వెనక్కి వెళ్లినా… ఇళ్లలో ఇంకా బురద నిలిచే ఉంది. పరామర్శను మొక్కుబడిగా కాకుండా… ఇంటింటికి వెళ్లి బాధితులను పలకరించి, పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు జగన్. బాధితుల పిల్లల్ని ఎత్తుకున్నజగన్ వారిలో ఒకరిగా కలిసిపోయారు.
Read Also: Koffe With Karan: చివరిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నావ్.. విజయ్ దేవరకొండ బోల్డ్ ఆన్సర్
వశిష్ట కాల్వపై గండిపెదపూడిలంక దగ్గర వంతెన నిర్మించడం ద్వారా పై నాలుగు గ్రామాల ప్రజల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు జగన్. అలాగే పెదపూడిలంకలో గ్రామ సచివాలయ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోడానికి ప్రభుత్వం ఏం చేసిందో వివరించి చెప్పిన జగన్… పనిలోపనిగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. బాధితులకు తాత్కాలికంగా కొంత సాయం చేశామని… ఇంకా ఏం చేయాలన్నదానిపై పరిశీలన జరుగుతోందని.. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదని… పశువులకు నోళ్లు ఉంటే… అవి కూడా ప్రభుత్వ సాయం గురించి సంతోషంగా చెప్పేవన్నారు జగన్.
ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. గంటిపెదపూడిలో వరద బాధితులను పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఒక్కరూ మాకు అందలేదు అనడం లేదు.. పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సహాయం చేశామన్నారు.. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు ఇవ్వాలి, వరదల్లో నేను వచ్చుంటే అధికారులు నాచుట్టూ తిరిగేవారు , ఫోటోల్లో టీవీల్లో బాగా కనిపించేవాడిని.. కానీ, నేను అలా కాదు.. వారంరోజులు టైమ్ ఇచ్చి వచ్చానని తెలిపారు. ఇక, జి.పి.లంక వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం.. ఈఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు ఏపీ సీఎం.