NTV Telugu Site icon

YS Jagan Mohan Reddy: నేను, మీరు కలిస్తేనే 175కి 175 సీట్లు.. 19 నెలల్లో ఎన్నికలు..!

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: మరోసారి అధికారంలోకి రావడం కాదు.. ఈ సారి ఏకంగా 175కి 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అందుకు గాను గడగడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.. ఇక, కుదిరినప్పుడల్లా.. వరుసగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇవాళ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం… ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.. 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయన్న ఆయన.. పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది.. ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలి.. నియోజకవర్గంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది.. నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు వస్తుంది.. డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశాం.. ఈ నియోజకవర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081 కోట్లు ఇచ్చామని.. 93,124 కుటుంబాలకు మేలు చేశాం.. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి పట్టాలు ఇచ్చాం.. 47,123 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశామని వెల్లడించారు.

Read Also: Engineering Colleges: ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ

పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలను అందించామన్నారు సీఎం వైఎస్‌ జగన్.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేశాం.. బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశామన్న ఆయన.. మన ప్రతినిధిగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తున్నాం.. ప్రతి గ్రామ సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ఇచ్చాం.. ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు ఈ నిధులు కేటాయిస్తాం అన్నారు.. ప్రతి సచివాలయంలో కనీసం రెండురోజులు గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటల పాటు ఆ సచివాలయంలో తిరగాలని చెప్పామని.. దీనివల్ల ప్రాధాన్యతగా చేపట్టాల్సిన పనులను గుర్తించగలుగుతాం.. ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే, అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం మంచి విజయాలు సాధిస్తాం.. ముఖ్యమంత్రిగా నేను చేయాల్సింది చేశాను.. అదే సమయంలో మీరు చేయాల్సింది చేయాలి.. నేను, మీరు కలిస్తేనే.. 175కి 175 సీట్లు సాధించగలుగుతాం.. ఇదేమీ కష్టం కాదు, అసాధ్యం కానేకాదు.. అద్దంకిలో మునుపెన్నడూలేని విజయాన్ని నమోదు చేద్దామని పిలుపునిచ్చారు.