Site icon NTV Telugu

YSRCP: మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి.. ఆసక్తి రేపుతున్న సీఎం జగన్ ట్వీట్

Ys Jagan 1

Ys Jagan 1

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్కసారి అందరికీ కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసుకుంటున్నా’ అంటూ జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వానికి నేటితో మూడేళ్లు పూర్తి

కాగా మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇటీవల వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి అంటూ నాలుగు రోజుల పాటు బస్సుయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం నాడు అనంతపురంలో ముగిసింది. అటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి జగన్ మూడేళ్ల పాలన ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. అటు ఏపీలో జగన్ ఇమేజ్ మరింత పెరిగిందని.. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం ఖాయమని పలువురు మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version