Site icon NTV Telugu

Jagan Davos Tour: స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన సీఎం జగన్

Jagan Davos Tour Min

Jagan Davos Tour Min

దావోస్ పర్యటనలో ఏపీ సీఎం జగన్ స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. సీఎం అయిన తర్వాత ఎక్కువగా తెల్ల రంగు షర్టుల్లో మాత్రమే కనిపించే జగన్ తన తొలి విదేశీ పర్యటనలో క్యాజువల్ షర్ట్స్, జీన్స్ ప్యాంట్లతో కనిపించారు. ఓ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ఇలా దర్శనమిచ్చారు. దీంతో జగన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చించేటప్పుడు సీఎం జగన్ బ్లేజర్ కోట్ ధరించారు.

కాగా దావోస్‌లోని ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సు ముగించుకుని మంగళవారం ఉదయమే ఆయన విజయవాడ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్‌తో పాటు మంత్రి జోగి ర‌మేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి స‌మీర్ శ‌ర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈనెల 22 నుంచి 26 వ‌ర‌కు దావోస్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ ఎకన‌మిక్ ఫోరం స‌ద‌స్సు జరిగిన విషయం తెలిసిందే.

Exit mobile version