అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు… ఈ సారి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు… ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.. ఈ నెల 24వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో.. మూడో వారంలోనే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.. ఈ సారి సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు అంశంపై చర్చ జరుగుతుందని చెబుతున్నారు.. కాగా, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇప్పటికే రెండో సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.. ఈ నెల 7న జరగనున్న కేబినెట్‌లో అసెంబ్లీ సమావేశాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
Read Also: Central Government: రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. ఆ నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఇలా..