YSRCP Leader RC Obul Reddy Attacked: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్‌సీ ఓబుల్ రెడ్డి పై ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన ఓబుల్ రెడ్డిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఓబుల్ రెడ్డి.. ఇక, అపస్మాక స్థితిలో ఉన్న ఓబుల్ రెడ్డిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసుపత్రికి వెళ్లి దాడి జరిగిన వివరాలపై ఆరా తీశారు.. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తాడిపత్రి అనగానే టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితి ఉంటుంది.. ఈ నేపథ్యంలో.. ఆర్‌సీ ఓబుల్ రెడ్డిపై దాడి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేదా ఏవైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..
Read Also: Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు!
