Site icon NTV Telugu

JC Prabhakar Reddy: ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయ సమాధే..! జగన్‌కు జేసీ కీలక సూచనలు

Jc

Jc

JC Prabhakar Reddy: ఏది మాట్లాడినా ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్టుంగా మాట్లాడే జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది.. అయితే, ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయంగా సమాధి అవుతావు అంటూ వైఎస్‌ జగన్‌కు కీలక సూచనలు చేశారు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై స్పందించారు.. టీడీపీ మహానాడుకు వెళ్తే.. అక్కడి జనాలను చూసి మైండ్‌ పోయిందన్నారు.. అక్కడ వచ్చింది లీడర్లు కాదు.. సామాన్య ప్రజలే ఎక్కువ అన్నారు..

Read Also: PCC Chief Mahesh Goud: ఈటల రాజేందర్, హరీష్ రావు ఫామ్‌ హౌస్‌లో సీక్రెట్‌గా కలిశారు..

జగన్‌.. కావాల్సిన వ్యక్తివి.. మీ అమ్మ.. తాడిపత్రి నుంచి వచ్చిన వ్యక్తే అన్నారు జేసీ.. నాకు నచ్చిన నేతలు ముగ్గురే ముగ్గురు అందులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒకరు.. అందరితో.. నాతో అప్యాయంగా ఉండే వ్యక్తి ఆయన.. ఎక్కడ ఉన్నా అప్యాయంగా పలకరించే వ్యక్తి.. కానీ, నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు జగన్‌..? అని ప్రశ్నించారు.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే.. అది చేస్తాం.. ఇది చేస్తామని హెచ్చరిస్తున్నారు.. ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయంగా సమాధే అవుతావని హెచ్చరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మరోవైపు, నారా లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు జేసీ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, ప్రజలు.. ఇలా అందరితో లోకేష్‌ మమేకం అవుతున్నారు.. బాగా చదువుకున్న వ్యక్తి.. ప్రజలతో అలా కలిసిపోయే వ్యక్తికి మంచి ఫ్యూచర్ ఉంటుందని తెలిపారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఇక, పెద్దారెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ.. ఇక్కడ వచ్చి తిరుగుతూనే ఉన్నారు.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లమని కోర్టు చెప్పింది.. కానీ, సమాచారం ఇవ్వకుండానే తిరుగుతున్నారని విమర్శించారు జేసీ.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో జేసీ చేసిన సంచలన వ్యాఖ్యలను తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version