NTV Telugu Site icon

Disha SOS: దిశ SOS ఎఫెక్ట్.. మిస్సింగ్ కేసు నమోదైన గంటల వ్యవధిలోనే యువతి గుర్తింపు

Disha

Disha

తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని సదానగర్ లో నివాసం ఉండే రామకృష్ణ అనే వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు.. బాధితుల నుండి వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం యువతి స్నేహితులను, చుట్టుపక్కల వారిని, బంధువులను పోలీసులు విచారించారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక యువకుడి బైక్ పై యువతి వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అజ్ఞాత వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Seediri Appalaraju: అచ్చెన్నాయుడుకి బ్రైన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్

యువతిని బైక్ పై తీసుకెళ్లిన యువకుడు ఓం ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. దీంతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. యువతి, యువకులు ఇద్దరు మంగుళూరు దగ్గర ఉన్నట్లు టెక్నికల్ టీం గుర్తించింది. వెంటనే యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి, వీలయినంత త్వరగా అమ్మాయిని అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. తమ కూతురు కనిపించడం లేదని దిశ యాప్ కు కాల్ చేసిన వెంటనే తక్షణం స్పందించిన పోలీసులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మహిళలు మిస్సింగ్ అయినా పోలీసులు అలసత్వం వహించకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గంటల వ్యవధిలోనే మిస్సింగ్ అయిన వారి ఆచూకీ కనిపెడుతున్నామని స్పష్టం చేశారు.