Site icon NTV Telugu

TDP Worker Killed: అనంతపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసి హత్య..

Murder

Murder

TDP Worker Killed: అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్పను దారుణ హత్య చేశారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షిణారహితంగా పొడిచి చంపి.. మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆదెప్ప మంగళవారం వ్యక్తిగత పని మీద సరిహద్దునే ఉన్న కర్ణాటకకు వెళ్లి.. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో వస్తుండగా ఈ హత్య జరిగినట్లు ఆదెప్ప తరపు బంధువులు వెల్లడించారు.

Read Also: Bypolls: 7 రాష్ట్రాల్లోని 17 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్.. మరోసారి ఎన్డీయే వర్సెస్ ఇండియా బ్లాక్

కాగా, మొలకాల్మూర్‌ తాలూకా పేదారగుడ్డం వెళ్లే మార్గంలో ఆదెప్ప మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పట్టణ సీఐ శ్రీనివాసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఇంటి నుంచి ఆదెప్ప తీసుకెళ్లిన టూవీలర్‌ను పక్కనే వదిలేసి వెళ్లడంతో కర్ణాటకలో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరో వాదన కూడా తెర మీదకు వస్తుంది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చకత్వంపై గత కొంత కాలంగా టీడీపీ, వైసీపీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. టీడీపీ అధికారంలోకి రావడంతో రెండు రోజుల క్రితమే దేవాలయం తలుపులు తెరిచి పూజా కార్యక్రమాలు నిర్వహించిన గ్రామస్తులు.. అయితే, దేవాలయం పునః ప్రారంభం కార్యక్రమంలో ఆదెప్ప పూజలు చేయడంతో వైసీపీ నాయకులు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Exit mobile version