NTV Telugu Site icon

Tadipatri Sand Issue: ఎస్పీ వద్దకు చేరిన తాడిపత్రి ఇసుక పంచాయతీ..

Tadipatri Sand Issue

Tadipatri Sand Issue

Tadipatri Sand Issue: తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయితీ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్దకు చేరింది.. తాడిపత్రి లో ఇసుక అక్రమ రవాణా వివాదం రాష్ట్రస్థాయిలో హీట్ ను రాజేసిన విషయం విదితమే కాగా.. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా పలుమార్లు సీఐ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. నిన్నటి రోజున ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయాలని సీఐని కోరారు ఎమ్మెల్యే.. దీంతో.. ఫోన్ లో ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడారు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి.. ఇక, సీఐ తీరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.. రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ కమాపణ చెప్పాలంటూ ఆరు గంటల పాటు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ధర్నా చేశారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యేకు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి సారీ చెప్పడంతో వివాదం ముగిసింది.

Read Also: David Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్..

మరో వైపు తాడిపత్రి ఘటనపై స్పందించిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి.. తన వైపు నుంచి ఎలాంటి తప్పులేదని స్పష్టం చేశాడు. లా అండ్ ఆర్డర్ విఘాతం కలుగుతుంది అని ఆ సమయంలో క్షమాపణ కోరానని, ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని కాదని.. అది డీఎస్పీ విచారణ చేస్తాడు అని ఎమ్మెల్యేతో చెప్పానన్నారు.. తాడిపత్రి లో 14 నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నా.. ఎలాంటి ఇబ్బందులూ రాలేదన్నారు. ఎస్పీ దృష్టికి నిన్న జరిగిన విషయాన్ని వివరించినట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Naga Chaitanya: పెళ్లి అలాగే చేసుకుంటా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇక, జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసినట్టు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తెలిపారు. ఇసుక మాఫియాని ఆరికట్టాలని జిల్లా ఎస్పీని కోరానని వివరించారు.. పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదని, ఒకరిద్దరి పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని విమర్శించారు.. తాడిపత్రిలో ఇసుక మాఫియా గురించి ఎన్జీటీ కి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా గురించి నెల రోజుల నుంచి లెటర్లు రాస్తున్నా , ఎవరు స్పందించక పోవడం వల్ల స్వయంగా నేనే రంగంలోకి దిగానన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరితే గంటల సేపు వర్షంలో నిలబెట్టారన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోలేనప్పుడు సీఐగా ఎందుకు పనిచేయాలని ప్రశ్నించారు. ఇంకా కొంతమంది వైసీపీ జెండాను కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.