Site icon NTV Telugu

Super Six – Super Hit: నేడు అనంతలో సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్

Atp

Atp

Super Six – Super Hit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మొదటిసారి భారీ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇవాళ (సెప్టెంబర్ 10న) అనంతపురం వేదికగా సూపర్‌సిక్స్‌- సూపర్‌హిట్‌ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. గత 15 నెలల్లో రాష్ట్రంలో అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ సభను సిద్ధం చేశారు. ఇక, ఈ సభలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. అయితే, ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చునేలా తగిన ఏర్పాట్లను రెడీ చేశారు.

Read Also: Tollywood : మిరాయ్.. కిష్కింధపురి.. ప్రీమియర్స్ పై భయపడుతున్నారా?

అలాగే, వీరితో పాటు 3 పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. ఈ సభకు 3 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. ప్రైవేట్, ఆర్టీసీతో కలిపి 3,857 బస్సులను సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ కోసం కేటాయించారు. అలాగే, భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సభ కోసం 6 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక, ట్రాఫిక్‌ను కూడా దారి మళ్లించారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే వెహికిల్స్ ను వడియంపేట దగ్గర, బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను ఎన్‌ఎస్‌ గేటు వద్ద నుంచి దారి మళ్లించారు. సభ కోసం ఇప్పటికే ఉన్న 400 సీసీ కెమెరాలను ఉపయోగించడంతో పాటు కొత్తగా మరో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Exit mobile version