Paritala Sunitha: వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై హాట్ కామెంట్లు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. సీఎం చంద్రబాబు బావిలో దూకాలన్న జగన్ కామెంట్లుకు కౌంటర్ ఇచ్చిన ఆమె.. చంద్రబాబు బాయిలో దూకడం కాదు జగన్.. నువ్వు నీరు లేని బావిలో పడ్డా.. నీ పాపాలు పోవు అని వ్యాఖ్యానించారు.. సూట్ కేసు రెడీ చేసుకుని ఉండు… త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత..
Read Also: Banjara Hills: పబ్ లో ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచి.. యువకుడి కిడ్నాప్
అనంతపురం రూరల్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత .. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.. ప్రకాష్ రెడ్డికి నిద్రలో కూడా పరిటాల రవినే గుర్తొస్తున్నారు.. ఆయన చనిపోయి 20 ఏళ్లు అయింది.. ప్రకాష్ రెడ్డి ఇంకా మీకు భయం పోలేదా..? అని ప్రశ్నించారు.. పరిటాల రవి పేరు ఉచ్చరించకుండా మీ సమావేశాలే ఉండవు.. పరిటాల రవి హత్యలు చేసి ఉంటే గత ఐదేళ్లలో ఎందుకు నిరూపించలేకపోయావు.? అని నిలదీశారు.. నిత్యం ఇలాంటి అబద్ధాలతో కార్యకర్తలను రెచ్చగొడుతున్నావు అని మండిపడ్డారు.. 45 రోజులుగా ఎక్కడ దాక్కున్నావ్…? అని నిలదీశారు.. చిన్న కేసు ఉంటేనే అడ్రస్ లేకుండా పోతావు.. నెలకు ఒకసారి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి పోతున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోసారి పరిటాల కుటుంబం గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.
