NTV Telugu Site icon

Kasam Fashions: తాడిపత్రిలో కాసం ఫ్యాషన్ షోరూం ప్రారంభం..

Kasam Fashions

Kasam Fashions

తాడిపత్రిలో ప్రముఖ ఫ్యాషన్ షోరూం కాసం షోరూంను సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. షోరూమ్‌లో అన్ని వయసుల వారికి సరిపోయే చీరలతో సహా అనేక రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కాసం సంస్థల చైర్మన్‌ కాసం నమశ్శివాయ మాట్లాడుతూ.. తాడిపత్రిలో కాసం ఫ్యాషన్ షో ప్రారంభించామన్నారు. తమ సంస్థ వరంగల్‌లో మొదటి స్టోర్‌ను ప్రారంభించామని.. అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లో కూడా తమ స్టోర్స్‌ ఓపెన్‌ చేశామని తెలిపారు. అందులో భాగంగా.. తాడిపత్రిలో ప్రారంభించామని చెప్పారు. కరువు ప్రాంతమైన తాడిపత్రిలో నిరుద్యోగుల కొరకు దాదాపు 300 మంది అంచనాతో.. వంద మందికి ఉపాధి ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా.. తమ వ్యాపార సంస్థ సంస్థలను ప్రోత్సహించాలని ప్రజలను ఆయన కోరారు.

Read Also: Maharashtra: నాసిక్‌లో దారుణం.. వ్యక్తిని చంపి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి, కొడుకు

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. కాసం ఫ్యాషన్ షోరూంలో అన్ని వయస్సుల వారికి నాణ్యమైన రెడీమెడ్‌ వస్త్రాలతో పాటు మహిళలకు సరసమైన ధరలకే చీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనసూయను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో షాపింగ్‌ మాల్‌ వద్దకు చేరుకుని సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు.

Read Also: Maharashtra: నాసిక్‌లో దారుణం.. వ్యక్తిని చంపి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి, కొడుకు

Show comments