Nandamuri Balakrishna: ఎన్టీఆర్‌కు భారతరత్నపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
- నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలి..
- నాన్నకు భారతరత్న అవార్డు రావాలని అనేది కోట్లాదిమంది ఆకాంక్ష..
- కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అలియాస్ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, ఆయన కుమారుడైన టీడీపీ ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణను ఈ మధ్యే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ వరించింది.. అయితే, ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.. నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలని వ్యాఖ్యానించారు.. నాకు పద్మభూషణ్ అవార్డు కంటే.. నాన్నకు భారతరత్న అవార్డు రావాలని అనేది కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆకాంక్షగా పేర్కొన్నారు.. కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.. ఆయనకు భారతరత్న అవార్డును.. తెలుగు ప్రజలు, తెలుగు జాతీయ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ..
Read Also: Rahul Gandhi: యూపీఏ, ఎన్డీఏ పాలనపై రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
అయితే, తనకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు బాలయ్య.. తనలో ఈ అవార్డు మరింత కసి పెంచిందన్న ఆయన.. అందుకే అంటున్నా.. తన రెండో ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందన్నారు.. తనకు ప్రతీ పాత్ర ఛాలెంజ్‌గా ఉంటుంది. తనకు తానే ఛాలెంజ్.. తన పాత్రను తానే ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాను అన్నారు.. నా గురించి నేను తెలుసుకోవడమే గొప్ప విద్యగా చెప్పుకొచ్చారు బాలయ్య.. ఒకదానితో తృప్తి పడొద్దు.. అవకాశాలు వస్తున్నాయి.. ఆదరిస్తున్నారు కాబట్టి.. ఇంకా మనం మన్నళ్లి ఎలా పదును పెట్టుకోవాలని ఆలోచించాలి అన్నారు.. ఈ సమయంలో ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డుపై మీడియా ప్రశ్నించగా.. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుంది.. తప్పకుండా వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆయనకు భారతరత్న వచ్చేవరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ..
తాజావార్తలు
-
BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం..
-
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్‌మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
-
Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
-
PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
-
Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!