టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. గతంలో యువగళం పేరుతో తాడిపత్రికి వచ్చి తనపై నిరాధారమైన ఆరోపణలు చేశాడు లోకేష్.. మరలా లోకేష్ శంఖారావం పేరుతో తాడిపత్రికి వస్తున్నాడు అని ఆయన తెలిపారు. అధికారంలోకి వస్తే ఏమి చేయబోతున్నామో చెప్పాలి.. గతంలో చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి.. రెడ్ బుక్ లో ఏమీ రాసుకోవడం లేదు.. అన్నీ ఖాళీ పేపర్లే.. అధికారంలోకి వస్తే కదా రెడ్ బుక్ గురించి మాట్లాడేదీ.. కొడుక్కి మంత్రి పదవి కోసమే జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై కేసులు పెట్టించుకుంటున్నాడు అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు.
Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ ముంబైని వీడి.. చెన్నై తరపున ఆడాలి: రాయుడు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ తప్ప ఎవరు సీఎం అయ్యే అవకాశం లేదు అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. అధికారంలోకి రావాలన్న టీడీపీ కల… కలలాగే మిగిలిపోతుంది అని విమర్శించారు. రెడ్ బుక్ అనేది లేదు… భయపెట్టాడానికే ఇదంతా చెబుతున్నారు అని విమర్శలు గుప్పించారు. టీడీపీ కండువా కప్పుకోగానే గుమ్మనూరు జయరాం పునీతుడు అయ్యాడా?.. రెడ్ బుక్ లో గుమ్మనూరు జయరాం పేరు కొట్టేశారా? అంటూ ప్రశ్నించారు. నారా లోకేష్ రాయలసీమ వాసి కాదు.. తెలంగాణా వాసి అంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు.