NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే తెలుస్తుంది..

Peddireddy

Peddireddy

తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని తెలిపారు. టీడీపీ పతనావస్థకు చేరింది… ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు.

Read Also: YV SUbba Reddy: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్..! వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈనెల 18న రాప్తాడులో రాయలసీమ జిల్లాల ‘సిద్ధం’ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు భారీగా పార్టీ క్యాడర్, నాయకులు హాజరవుతారని చెప్పారు. ఎన్నికలకు ఇది శంఖారావం.. ఇప్పటికే భీమిలి, ఏలూరులో సభ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.

Read Also: Ashok Chavan: నిన్న కాంగ్రెస్‌కు రాజీనామా.. నేడు బీజేపీలో జాయిన్

షర్మిల టీడీపీ అజెండాలో భాగంగా పని చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. అందరూ ఏకం అవుతారని మొదటి నుండి చెప్తున్నాం.. జగన్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారని అన్నారు. టీడీపీ నమోదు చేసిన దొంగ ఓట్ల వల్ల గతంలో తాము కొన్ని సీట్లు ఓడిపోయామన్నారు. తాము ఎలాంటి ఓటర్ నమోదులు చేయలేదని తెలిపారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసే లక్షణం చంద్రబాబుదని దుయ్యబట్టారు.