Site icon NTV Telugu

Kethireddy Pedda Reddy: మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి యత్నం..

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy: తాడిపత్రి పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి.. ఒకప్పుడు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎదురైన అనుభవాలు.. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎదురవుతున్నాయి.. హైకోర్టు ఆదేశాలతో తన సొంత ఇలాకాలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు పెద్దిరెడ్డి.. వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి యత్నాలు చేశారు.. దీని కోసం అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే కాగా.. తాను తాడిపత్రి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి.. కాగా, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. అయితే, పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.. తాజాగా మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాయడంపై చర్చ సాగుతోంది.. గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం కాగా.. మరి ఈ సారి పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..

Read Also: Delhi: ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు.. బీజేపీ కొత్త చీఫ్‌పై చర్చ జరిగే ఛాన్స్

Exit mobile version