JC Prabhakar Reddy: నాకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదు.. పల్లెల్లో మార్పే నా లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. 75 ఏళ్ల వయస్సులో కూడా తాను రాజకీయాల కోసం కాకుండా తన మనవళ్లు, మనవరాళ్ల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే చదువుకున్న నాయకులు రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. పల్లెల్లో మార్పు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
చదువుకున్న నాయకులు గ్రామాల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాను నిలబెట్టిన ప్రతి సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే ఆయా గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి విషయంలో తనకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదని, ప్రజలకు మంచి జరగడమే ముఖ్యమని తెలిపారు. ప్రస్తుత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలే చివరివి అవుతాయని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇకపై ఆన్లైన్ నామినేషన్ల విధానం అందుబాటులోకి వస్తుందని అన్నారు. అందువల్ల ఈ ఎన్నికలను కార్యకర్తలు, నాయకులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.
Also Read
- JC Prabhakar Reddy: ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే రాజీనామా చేయిస్తా..! సర్పంచ్‌లకు జేసీ వార్నింగ్
- JC vs Ketireddy: కోడి రక్తం చూస్తేనే కిందపడిపోతావు..! కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై జేసీ ఫైర్
- Ketireddy Vs JC: నా హత్యకు జేసీ కుట్ర..! కేతిరెడ్డి సంచలన ఆరోపణలు
- JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
పెద్దారెడ్డిపై జేసీ ఘాటు వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. నీ కుమారులు అన్ని గ్రామాల్లో తిరిగి నామినేషన్లు ఎందుకు వేయించలేదని ప్రశ్నించారు. నీ కుమారులు బాగుండాలి.. కార్యకర్తలు మాత్రం బలికావాలా? అని నిలదీశారు. కార్యకర్తలు ఈ విషయాలను ఆలోచించుకోవాలని సూచించారు.
ఏడాదిలో అభివృద్ధి చూపించకపోతే రాజీనామా చేయిస్తా
తాను నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏడాది తర్వాత కూడా అభివృద్ధిలో మార్పు కనిపించకపోతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయిస్తానని హెచ్చరించారు. గ్రామాల రూపురేఖలు మార్చడమే తన లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
JC Prabhakar Reddy: నాకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదు.. పల్లెల్లో మార్పే నా లక్ష్యం..
-
Post Office MIS Scheme: ఒక్కసారి రూ.5 డిపాజిట్ చేస్తే.. నెలానెలా జీతం లాంటి ఆదాయం!
-
Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
-
Kenishaa : జయం రవి వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఆ రోజు కోర్టుకు రాకపోతే అంతే!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!