NTV Telugu Site icon

JC Prabhakar Reddy: పోలీసులకి ఖాకీ డ్రెస్సులు ఎందుకు..? వాళ్లను చూస్తే సిగ్గేస్తుంది..!

Jc Prabhakar

Jc Prabhakar

Tension at Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం హీటెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాడిపత్రిలో నగర సుందరీకరణ పనులు చేస్తుంటే వైసీపీ వాళ్లు పార్టీ జెండాలు కట్టారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్టేషన్ ముందు రోడ్డుపై పడుకొని జేసీ నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వైసీపీ జెండాలు తీయిస్తామని చెప్పి.. ఇప్పటికి తొలగించలేదంటూ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.. కానీ, జేపీ ప్రభాకర్ రెడ్డి వినకపోవడంతో పోలీసులు ఆయణ్ని బలవంతంగా పోలీస్ జీపులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లుండగా.. మార్గమధ్యంలో వెహికిల్ నిలిపివేసి తన అనుచరులు, టీడీపీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ తీశారు.

Read Also: Bigg Boss Telugu : ఇకపై అవి రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు..?

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీవో వైఎస్ఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడు.. నేను పోలీసులను తిట్టినాను నాపై కేసు పెట్టి లోపల వేయించండి.. నా మీద పంతం నెగ్గించుకోవటానికి ఎమ్మెల్యే ఫ్యాక్షన్ చేయాలని అనుకున్నాడు.. మా గవర్నమెంట్ వస్తే ఆర్డీవోను ఇక్కడ వేయించుకొని ఊడిగం చేయిస్తాను గడ్డం గీయించుకుని నీతో జండాలు కట్టిస్తాను అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పోలీసులను తిట్టినాను ఎందుకురా మీకు ఖాకీ డ్రెస్సులు సిగ్గు లేదా ఖాకీ డ్రెస్సులు చూస్తే అసహ్యం వేస్తుంది అని విమర్శించారు. మా కలెక్టర్ అమ్మకి లెటర్లు టన్నుల కొద్ది రాసినాను ఇప్పటి వరకు రిప్లై రాలేదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.