Site icon NTV Telugu

High Tension In Ramagiri: అనంతపురంలో రాజకీయ వేడిని రాజేసిన వైసీపీ కార్యకర్త మృతి.. మాజీ ఎంపీ గోరంట్ల ఫైర్!

Atp

Atp

High Tension In Ramagiri: అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త మృతి రాజకీయ వేడిని రాజేసింది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించే ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరో వైపు, వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతి నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఆ పార్టీ నాయకులను ముందుస్తుగా హౌస్ అరెస్ట్ లు చేశారు పోలీసులు.

Read Also: Minister Uttam: నేడు కాకినాడకు తెలంగాణ మంత్రి ఉత్తమ్

అయితే, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించినడానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గోరంట్లకు పోలీసులకు మధ్య కాసేపు ఉద్రికత్త నెలకొంది. దీంతో ఆయనకు సర్దిచెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. వినకపోవడంతో పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Exit mobile version