NTV Telugu Site icon

AP Crime: కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర పేరుతో టోకరా.. మధ్యలో వదలి పరార్..!

Kedarnath

Kedarnath

AP Crime: గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్‌ యాత్రను చార్‌ధామ్‌ యాత్రగా పేర్కొంటారు.. మరికొందరు వీటిలో ఏవైనా రెండు సందర్శిస్తే.. ఆ యాత్రను దో ధామ్ యాత్రగా పేర్కొంటారు.. ఇందులో ఎక్కువ సంఖ్యలో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు దర్శనానికి వెళ్తుంటారు భక్తులు.. ఈ యాత్ర పేరుతో పెద్ద బిజినెస్‌ జరుగుతోంది.. అయితే, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన అనంతపురం యాత్రికులకు ఓ ట్రావెల్ ఏజెన్సీ టోకరా పెట్టింది. దో ధామ్‌ పేరుతో అనంతపురం పట్టణంలోని రామ్ నగర్ లో ఉన్న ఉదయ శంకర్ ట్రావెల్స్.. కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి పెద్ద మొత్తంలో యాత్రికల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసింది..

Read Also: IND vs SA: చరిత్ర సృష్టించే దశలో రోహిత్.. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో రికార్డు ఎలా ఉందంటే?

కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి అనంతపురానికి చెందిన దాదాపు 70 మంది యాత్రికుల నుంచి 60 వేల రూపాయల చొప్పున దాదాపు కోటి రూపాయలు ఉదయ్ శంకర్ ట్రావెల్స్ వసూలు చేసింది. నగరంలోని రామ్ నగర్ లో ఉంటున్న ఉదయ శంకర అనే వ్యక్తి ఉదయ శంకర్ ట్రావెల్స్ ను నడుపుతున్నాడు. అయితే అనంతపురం నుంచి హరిద్వార్ వరకు యాత్రికలను తీసుకువెళ్లాడు. కానీ, అక్కడ యాత్రికుల నుంచి మిగిలిన సొమ్మును వసూలు చేసి.. మరి కొద్ది సేపట్లో బయలుదేరుదామని చెప్పి అక్కడి నుంచి ఉదయ్ శంకర్ పరారయ్యాడు. ఎంతసేపటికి ట్రావెల్స్ నిర్వాహకుడు ఉదయ శంకర్ రాకపోవడంతో సొంత ఖర్చులతో హరిద్వార్ నుంచి అనంతపురానికి యాత్రికులు వచ్చారు. ఉదయ్ శంకర్ ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు బాధితులు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి 60 వేల రూపాయలు వసూలు చేసి దాదాపు కోటి రూపాయలు టోకరా వేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ శంకర్ ట్రావెల్స్ యజమాని ఉదయ శంకర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.