AP Crime: కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర పేరుతో టోకరా.. మధ్యలో వదలి పరార్..!
- కేదార్నాథ్.. బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన అనంతపురం యాత్రికులకు ఓ ట్రావెల్ ఏజెన్సీ టోకరా..
- దాదాపు 70 మంది యాత్రికుల నుంచి 60 వేల రూపాయల చొప్పున వసూలు..
- అనంతపురం నుంచి హరిద్వార్ వరకు యాత్రికలను తీసుకెళ్లిన ట్రావెల్ ఏజెన్సీ..
- అక్కడి నుంచి ఏజెంట్ ఉదయ్ శంకర్ పరారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రను చార్‌ధామ్ యాత్రగా పేర్కొంటారు.. మరికొందరు వీటిలో ఏవైనా రెండు సందర్శిస్తే.. ఆ యాత్రను దో ధామ్ యాత్రగా పేర్కొంటారు.. ఇందులో ఎక్కువ సంఖ్యలో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు దర్శనానికి వెళ్తుంటారు భక్తులు.. ఈ యాత్ర పేరుతో పెద్ద బిజినెస్ జరుగుతోంది.. అయితే, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన అనంతపురం యాత్రికులకు ఓ ట్రావెల్ ఏజెన్సీ టోకరా పెట్టింది. దో ధామ్ పేరుతో అనంతపురం పట్టణంలోని రామ్ నగర్ లో ఉన్న ఉదయ శంకర్ ట్రావెల్స్.. కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి పెద్ద మొత్తంలో యాత్రికల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసింది..
Read Also: IND vs SA: చరిత్ర సృష్టించే దశలో రోహిత్.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో రికార్డు ఎలా ఉందంటే?
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి అనంతపురానికి చెందిన దాదాపు 70 మంది యాత్రికుల నుంచి 60 వేల రూపాయల చొప్పున దాదాపు కోటి రూపాయలు ఉదయ్ శంకర్ ట్రావెల్స్ వసూలు చేసింది. నగరంలోని రామ్ నగర్ లో ఉంటున్న ఉదయ శంకర అనే వ్యక్తి ఉదయ శంకర్ ట్రావెల్స్ ను నడుపుతున్నాడు. అయితే అనంతపురం నుంచి హరిద్వార్ వరకు యాత్రికలను తీసుకువెళ్లాడు. కానీ, అక్కడ యాత్రికుల నుంచి మిగిలిన సొమ్మును వసూలు చేసి.. మరి కొద్ది సేపట్లో బయలుదేరుదామని చెప్పి అక్కడి నుంచి ఉదయ్ శంకర్ పరారయ్యాడు. ఎంతసేపటికి ట్రావెల్స్ నిర్వాహకుడు ఉదయ శంకర్ రాకపోవడంతో సొంత ఖర్చులతో హరిద్వార్ నుంచి అనంతపురానికి యాత్రికులు వచ్చారు. ఉదయ్ శంకర్ ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు బాధితులు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి 60 వేల రూపాయలు వసూలు చేసి దాదాపు కోటి రూపాయలు టోకరా వేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ శంకర్ ట్రావెల్స్ యజమాని ఉదయ శంకర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!