Hanumantha Rao Chowdary: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు.. ఆయన వయస్సు 81 సంవత్సరాలు.. ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఆయన ఆరేళ్ల పాటు పనిచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పదేళ్ల పాటు పనిచేశారు. కళ్యాణదుర్గం మండలం గరుడాపురం పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. నెల రోజులుగా గుండే, శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఇబ్బందులు పడుతూ.. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమంతరాయ చౌదరి స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులు..
Hanumantha Rao Chowdary: టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత..

Hanumantha Rao Chowdary