రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి.. చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు? అని ప్రశ్నించారు. నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా అని అన్నారు. తన నడక కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా చంద్రబాబూ? అని ప్రశ్నించారు. తన సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? అని మండిపడ్డారు.
Mamata Banerjee: కేంద్రం ఆధార్ కార్డుల్ని డీయాక్టివేట్ చేస్తోంది.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..
జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడు కాబట్టి, వైసీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికి ఉందని తెలుసన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి సామాజికవర్గానికి, ప్రతి పేదవాడూ జగన్‌ను, వైసీపీని గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆరోపించారు. 125సార్లు ఈ 57 నెలల్లో బటన్లు ప్రజల కోసం నొక్కానని.. ఏకంగా 2.55 లక్షల కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లిందని తెలిపారు. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండని సూచించారు.
CM Jagan: ఎన్నికలయ్యాక టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు..
ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదన్నారు. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుందని విమర్శించారు. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది.. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి అని పేర్కొన్నారు. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, మీరే సైనికులుగా నిలబడండి అని ప్రతి ఇంటికీ వెళ్లి నిబద్ధతతో మనం సిద్ధం అంటుంటే, మరోవైపు.. బాబు పేదల ఇంటికిగానీ, పేదల సామాజికవర్గాలకు గానీ, గ్రామాలకుగానీ, రాష్ట్రానికి గానీ ఏం చేశాడో చెప్పుకొనేందుకు ఒక్కటి కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడని సీఎం తెలిపారు.