Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion Without Water: పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి.. వర్షాల జాడ లేదు.. వర్షా కాలంలో ఏ నెల తీసుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే.. వర్షాలు పడింది లేదు.. వాగులు సాగింది లేదు.. కుంటలు, చెరువులు, నదులు, ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చింది లేదు.. కాలువలకు నీరు వదిలింది లేదు.. అన్నట్టుగా పరిస్థితి తయారైంది.. వర్షాలు కాస్త లేట్‌గా పడినా.. కనీసం వినాయక చవితి వరకు.. లేదా నిమజ్జనం వరకైనా వర్షాలు పడతాయి.. వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అంతా ఎదురుచూశారు.. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలకే కాదు.. దేవుళ్లకూ నీటి కష్టాలు తప్పడం లేదు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం మండలం మీదుగా వెళ్తున్న హెచ్ఎల్సీలో ఈ సారి నీటి జాడ కరువైంది. దీంతో రైతులు, ప్రజలు సాగు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రావడం, లంబోదరుడి విగ్రహాల నిమజ్జనానికి కూడా నీరు కరువవడంతో చేసేదిలేక వెంకటాపురం, దయ్యాల కుంటపల్లికి చెందిన ప్రజలు ఒట్టి కాలువలోనే వినాయకులను వదిలేసి వచ్చారు. మరోవైపు ఎల్లనూరు మండలం చిత్రావతి లోను నీళ్లు లేకపోవడంతో.. ఎండిపోయిన చెరువులోనే వినాయక ప్రతిమలను వదిలివేసి వెళ్లారు. పండుగ వేళ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సైతం నీరు అందుబాటులో లేకపోవడం అనంతపురం జిల్లాలో నెలకొన్న నీటి కష్టాలకు అద్దం పడుతోంది. ఒకవైపు సాగు, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు పండుగ నిమజ్జనానికి కూడా నీరు లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది… నీరు లేని కాలువలు.. ఎండిన చెరువుల్లోనే గణపయ్య విగ్రహాలు నిమజ్జనం చేయాల్సిన దుస్థితి వచ్చింది.. ఘనంగా గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చే అవకాశమే లేకుండా పోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Also Read
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
తాజావార్తలు
-
Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..